
అనకాపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్యం విభాగ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి, కసింకోట మండలాల్లోని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుతున్న తాగునీటి సరఫరా, పారిశుధ్య పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వేసవికాలం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం సురక్షితమైన తాగునీటి సరఫరా అందించాలని అధికారులను ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డి.ఈ ప్రసాద్, అనకాపల్లి మండలం ఏ.ఈ హిమబిందు, కసింకోట మండలం ఏ.ఈ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.