
నంద్యాల: జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నంద్యాల జిల్లా జనసేన నాయకులు రాచమడుగు చందు మరియు సుందర్ తీవ్రంగా స్పందించారు. పాశ్యం యాదగిరి మాట్లాడే సమయంలో తన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని వారు హెచ్చరించారు.
పార్టీ అధినేతపై మళ్లీ అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వారు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా మాట్లాడడం తగదని, ఇలాంటి వ్యాఖ్యలు సహించబోమని తెలిపారు.
మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడితే మర్యాద దక్కదని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరించారు.
ఈ మేరకు రాచమడుగు చందు మరియు సుందర్, జనసేన పార్టీ, నంద్యాల జిల్లా తరఫున స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.