
పాలకొల్లు: దిగమర్రు గ్రామానికి చెందిన సీనియర్ మెగా అభిమాన నాయకులు చేబ్రోలు కృష్ణమోహన్ మాతృమూర్తి చేబ్రోలు రమామణి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాక్టర్ డీజిల్ ఖర్చు మరియు డ్రైవర్ జీతం కోసం అందించిన ఆర్థిక సహాయంతో ఉచిత వాటర్ ట్యాంకర్ సేవను ఏర్పాటు చేశారు. గొంది పద్మరాజు గారి కాలనీ ప్రజలు తాగునీటి అవసరం ఉందని కోరడంతో, వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచితంగా తాగునీరు సరఫరా చేశారు.
ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు, సఖినేటిపల్లి నీటి సంఘం అధ్యక్షులు నామన నాగభూషణం తెలిపారు. ప్రజల తాగునీటి సమస్యలను తీర్చడమే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు