
పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పి.ఏ.డి.ఏ) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శివరాం ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. జనసేన నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం, పిఠాపురం నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యల పరిష్కారం కోసం పెంకే జగదీష్ వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా పిఠాపురం మండలం విరవాడ గ్రామం మరియు పట్టణం మధ్య ఉన్న గంగానగరం ప్రాంతంలో శెట్టిబలిజ కమ్యూనిటీ ప్రజలు గత 60 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. మౌలిక సదుపాయాల లోపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీటిని తక్షణమే పరిష్కరించాలని కోరారు.
ఈ వినతిపై స్పందించిన పడా డైరెక్టర్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ.. వచ్చే వారం రోజుల్లో స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలిస్తామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ నక్క నారాయణమూర్తి, పెంకే సతీష్, విరవాడ జనసేన కమిటీ గ్రామ అధ్యక్షుడు కూరాకుల వీరబాబు, బొజ్జ రాంప్రసాద్, మైనం నాగేశ్వరరావు, మైనం స్వామి, శెట్టిబలిజ సోదరులు, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.