నందలూరులో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు

రాజంపేట: జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా జీవితంలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ అతికారి దినేష్ సూచన మేరకు, నందలూరు మండల జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. రాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరుతో అర్చనలు, పూజలు నిర్వహించి ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు.

పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజల ఆర్థికాభివృద్ధికి మరింత బలమైన పునాది వేయాలని, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్ర చరిత్రలో నిలిచేలా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పర్నా రామయ్య, అనిమల రామచంద్రయ్య, తోట సుబ్బయ్య, అక్కిశెట్టి రెడ్డయ్య (రాధి), హోటల్ శివ, అనిమల రాము, గాదెరాజు మల్లికార్జున రాజు, రాకేష్, భాస్కర్, హరిబాబు, డాలా, యెద్దల నరసింహ, రత్నం తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. అందరూ కలిసి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.