
బంగ్లాదేశ్‌లో 500 రోజులకు పైగా జైలులో ఉన్న ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభుకు వెంటనే న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆయనకు తక్షణ వైద్య సహాయం అందించడంతో పాటు, బెయిల్ మంజూరు చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఈ అంశంపై స్పందించిన పవన్ కళ్యాణ్, “500 రోజులకు పైగా జైలులో ఉంచి పదేపదే బెయిల్ నిరాకరిస్తున్నారు. ఆయన తరఫు న్యాయవాదులను కూడా కోర్టులో బెదిరిస్తుంటే న్యాయం ఎలా జరుగుతుంది?” అని ప్రశ్నించారు.
మైనారిటీ హిందూ సమాజ హక్కుల కోసం పోరాడటం నేరమా అని ప్రశ్నించిన పవన్, కాషాయ వస్త్రాలు ధరించిన ఆధ్యాత్మిక గురువును నేరస్థుడిలా చూడటం బాధాకరమన్నారు.
కొన్ని అంశాలపై వెంటనే స్పందించే నకిలీ సెక్యులరిస్టులు, సెలెక్టివ్ మానవ హక్కుల కార్యకర్తలు ఈ విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఆయన విమర్శించారు.
చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభుకు