రైతుల సమస్యలు పరిష్కరించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోళ్ల రాజేష్

ఇచ్చాపురం మున్సిపాలిటీ 4, 5వ వార్డుల పరిధిలో రైతులు చాలాకాలంగా ఎదుర్కొంటున్న మురుగు నీరు, ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు జనసేన నాయకుల చొరవతో పరిష్కారం లభించింది. రెండు నెలల క్రితం స్థానిక రైతుల సమస్యలను గుర్తించిన మున్సిపాలిటీ ఇంచార్జి రోకల్ల భాస్కర్‌రావు ఆహ్వానం మేరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ లోళ్ల రాజేష్ రైతులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డ్రైనేజీ కాలువల ద్వారా పంట పొలాల్లోకి చేరుతున్న కలుషిత నీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగించి రైతులకు ఉపశమనం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. లోళ్ల రాజేష్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఇంచార్జి రోకల్ల భాస్కర్‌రావు, మండల నాయకుడు చీకటి కృష్ణయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రోక్లెయిన్ సహాయంతో కాలువలు శుభ్రపరిచి, పంట పొలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు.

సమస్య పూర్తిగా పరిష్కారమవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ లోళ్ల రాజేష్‌కు, జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన పార్టీ నాయకులు చూపుతున్న చొరవను స్థానికులు ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో పి. కామేశ్వరరావు, సుజిత్ పండిత్, దాసరి రామారావు, ఉప్పాడ ప్రభాకర్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.