జనసేన అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్

విజయవాడలో జనసేన పార్టీ అధికార ప్రతినిధుల కోసం రెండు రోజుల ప్రత్యేక శిక్షణ వర్క్‌షాప్ మంగళవారం ప్రారంభమైంది. రోజువారీ మీడియాలో ప్రజా సమస్యలు, రాష్ట్ర మరియు జాతీయ రాజకీయ అంశాలపై జరిగే చర్చల్లో పార్టీ తరఫున బలమైన, బాధ్యతాయుతమైన స్వరం వినిపించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవ న్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ వర్క్‌షాప్ ఏర్పాటు చేయబడింది.

సమకాలీన అంశాలపై లోతైన అవగాహన పొందడంతో పాటు, మీడియా చర్చల్లో సమర్థంగా పాల్గొనే నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ శిక్షణ ప్రధాన లక్ష్యం. పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి నేతృత్వంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో, పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఎం.ఎస్.ఎం.ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్సీ శివశంకర రావు మరియు ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, అలాగే పలువురు మేధావులు మరియు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. వారు ప్రతినిధులకు వివిధ అంశాలపై మార్గదర్శనం చేసి, చర్చలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే విధానాలపై సూచనలు అందించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.