జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి – ఘన నివాళులు

జనసేన పార్టీ ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ సమాజ అభివృద్ధికి ఆయన ఆలోచనలు ఎప్పటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో షేక్ హల్చల్ జహీర్, నాగార్జున అర్జున్ యాదవ్, ఏఎంసి డైరెక్టర్ ఇనగంటి శైలజ, మదర్ వలి, శ్రీను, ఉమామహేశ్, రసూల్, మణికంఠ, వాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.