వెలగవాడలో అంబేద్కర్ జయంతి ఘన నివాళులు

పాలకొండ నియోజకవర్గం: డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పాలకొండ నియోజకవర్గం వెలగవాడ గ్రామంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్, పాలకొండ నియోజకవర్గం సీనియర్ నాయకుడు గర్భాన సత్తిబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ రాజ్యాంగాల్లో అత్యుత్తమమైనది భారత రాజ్యాంగమని పేర్కొన్నారు. కుల, మత, జాతి వివక్షకు తావులేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. ఆ మహనీయుని స్ఫూర్తిని జనసేన పార్టీ ఆచరణలో చూపిస్తూ, దేశ సమగ్రతను కాపాడుకుంటూ ముందుకు సాగుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొని అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.