
శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు పూజ అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొట్టే సాయి వెంకట్‌ను జనసేన పార్టీ పామూరు మండల అధ్యక్షుడు దర్శి ఏడుకొండలు కలిసి శాలువాతో సన్మానించారు.
ఆలయ కార్యాలయంలో జరిగిన ఈ మర్యాదపూర్వక సమావేశంలో బొంతల సుధీర్, ప్రవీణ్, నాని నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో చైర్మన్ చేస్తున్న సేవలను వారు అభినందించారు.
ఈ సందర్భంగా పరస్పరం ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం.