
అనంతపురం : జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ జిల్లా పరిశీలకుడు, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అనంతపురం పర్యటన సందర్భంగా స్థానిక అలెగ్జాండర్ హోటల్లో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
జిల్లా అధ్యక్షుడు, అహుడా చైర్మన్ టీ.సీ. వరుణ్ ఆధ్వర్యంలో అజయ్ కుమార్కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ నిర్మాణం, సంస్థాగత బలోపేతం, సమాచార సేకరణ కమిటీ కార్యాచరణపై నాయకులు పరస్పరం చర్చించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర, జిల్లా కమిటీ సభ్యులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొని పరిశీలకుడికి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పొదిలి బాబురావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, నగర ఉపాధ్యక్షులు గ్రంధి దివాకర్, జక్కిరెడ్డి ఆదినారాయణ, సీనియర్ నాయకుడు కాయగూర లక్ష్మీపతి, జిల్లా కార్యదర్శి సంజీవరాయుడు, నగర ప్రధాన కార్యదర్శి రోడ్ల భాస్కర్, నగర కార్యదర్శులు లాల్ స్వామి, వల్లంశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.