కార్మికులకు మే డే శుభాకాంక్షలు

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సమాజ నిర్మాణం కోసం తమ స్వేదాన్ని దారబోస్తున్న ప్రతి శ్రమ జీవికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎక్కడ కార్మికుడి చెమట చుక్క చిందుతుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. పరిశ్రమల్లో పని చేసే కార్మికుడి నుంచి ఉపాధి శ్రామికుల వరకు మన దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములే. అలాంటి శ్రామికుల సంక్షేమం కోసం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనికతలో, ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.
ముఖ్యంగా ఉపాధి శ్రామికులకి గౌరవంతో కూడిన గుర్తింపుతో పాటు వారి జీవితాలకు, కుటుంబాలకు పూర్తి స్థాయి భద్రత, భరోసా ఇస్తున్నాం. ఆ దశగా ఇప్పటికే అడుగులు వేశాం. ప్రమాదవశాత్తు ఉపాధి హామీ పని ప్రదేశాల్లో శాశ్వత వైకల్యం కు గురైన వారికి మరియు ప్రాణాలు కోల్పోయిన ఉపాధి శ్రామికులకి ఇప్పటివరకు ఇస్తున్న రూ. 50 వేల పరిహారాన్ని రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వచ్చేలా పెంచాం. మీ శ్రమతోనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు అందించగలుగుతున్నాం. మీ సహాయంతో కూటమి ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్స్, ఫారంపాండ్స్ తదితర కార్యక్రమాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు మే డే సందర్భంగా మాకు అందుబాటులోకి వచ్చి తమ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన గౌరవ శాసన సభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి, ప్రముఖ నటులు శ్రీ నాని గారికి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీమతి పి.వి.సింధు గారికి ధన్యవాదాలు తెలుయజేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.