పవన్‌ను పరామర్శించేందుకు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (శనివారం) హైదరాబాద్‌కు పయనమవుతున్నారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయనను పరామర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌లోని నివాసానికి సీఎం వెళ్లనున్నట్లు సమాచారం.

గత నెలలో అధికారులతో సమీక్ష సందర్భంగా అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షల అనంతరం ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యులు సూచించిన మేరకు ఆయన పది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటూ ప్రస్తుతం హైదరాబాద్‌లోని నివాసంలోనే ఉన్నారు.

ఇదిలావుంచితే, ఇటీవల మరణించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రీజెన్సీ సెరామిక్స్ అధినేత జీఎన్ నాయుడు కుటుంబాన్ని కూడా సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. నందగిరి హిల్స్‌లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.