పెళ్లిళ్ల వెంకన్నకు రూ.14.98 లక్షల హుండీ ఆదాయం

అమలాపురం నియోజకవర్గం: అమలాపురం పట్టణ పరిధిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించబడింది. దేవదాయ ధర్మదాయ శాఖ అమలాపురం తనిఖీదారు జె. రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో, ధర్మకర్తల మండలి చైర్మన్ కంచిపల్లి సత్యనారాయణ (అబ్బులు) మరియు సభ్యుల సమక్షంలో హుండీలు తెరిచి లెక్కించారు.

పోలీసు బందోబస్తు, శ్రీవారి సేవకులు మరియు భక్తుల సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో రెండు నెలల మూడు రోజుల కాలానికి గాను మొత్తం రూ.14,98,416 నగదు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి.వి.వి. సత్యకుమార్ తెలిపారు.

హుండీల వారీగా వచ్చిన ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీకి రూ.12,85,671, శ్రీ లక్ష్మీ గణపతి స్వామి హుండీకి రూ.89,649, శ్రీ వైష్ణవి కనకదుర్గ దేవి హుండీకి రూ.80,968, శ్రీ జ్ఞాన సరస్వతి దేవి హుండీకి రూ.36,483, అన్నప్రసాద వితరణ హుండీకి రూ.5,645 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

దేవస్థానం ఆదాయం భక్తుల సేవా కార్యక్రమాలు మరియు అభివృద్ధి పనులకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.