
యర్రగొండపాలెం నియోజకవర్గం: దోర్నాల మండల కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యం కోసం రూ.44 లక్షలతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్‌కు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాలుగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా దోర్నాలలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ, బస్టాండ్ లేక ఇబ్బంది పడిన ప్రయాణికులకు ఇది శుభవార్తగా అభివర్ణించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు.
అనంతరం దూపాడు–దోర్నాల పైపు లైన్ పనులను కూడా ప్రా