రాజోలు నియోజకవర్గంలో రూ.27.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

రాజోలు, ఆగస్టు 25: రాజోలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మరింత ఊతమిస్తూ, రూ.26 కోట్ల SASCI నిధులతో చేపట్టనున్న 21 పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణ పనులకు, రూ.1.40 కోట్లతో చేపట్టనున్న ఒక R&B తారు రోడ్డు పనికి, రూ.60 లక్షల పుష్కరాల నిధులతో అంతర్వేది శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ ఆగస్టు 26, 27 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ అభివృద్ధి పనుల మొత్తం అంచనా వ్యయం రూ.27.40 కోట్లు.

నియోజకవర్గంలోని గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ రోడ్డు పనులను చేపడుతున్నట్లు తెలిపారు.

ఆగస్టు 26న ఉదయం 10 గంటల నుంచి వివిధ గ్రామాల్లో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి మరికొన్ని రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. ఆగస్టు 27న ఉదయం 10 గంటలకు అంతర్వేది శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి మరిన్ని R&B, పంచాయతీరాజ్ రోడ్ల పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయి.

ఈ పనుల్లో CC, BT రోడ్ల నిర్మాణాలతో పాటు R&B పరిధిలోని తారు రోడ్ల పనులు కూడా ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం వివిధ గ్రామాలు, మండలాల్లో ప్రజలకు అవసరమైన రహదారి సౌకర్యాలను మెరుగుపరిచేలా పనులు చేపట్టనున్నారు.

అంతర్వేది శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.60 లక్షల పుష్కరాల నిధులు కేటాయించగా, ఆగస్టు 27న ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో పనులకు శంకుస్థాపన జరగనుంది.

నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమాలకు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.