
పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బర్రింకలపాడు | తేదీ: 25-08-2026
పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో P4 టీమ్ ఆధ్వర్యంలో రూపొందించిన జూన్–జులై నెలల న్యూస్లెటర్ను పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు మంగళవారం బర్రింకలపాడు గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ న్యూస్లెటర్లో జూన్–జులై నెలల్లో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను పొందుపరిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, పోలవరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో న్యూస్లెటర్ను రూపొందించినట్లు తెలిపారు.
నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో P4 యంగ్ ప్రొఫెషనల్ జగదీశ్వరరావు, టీమ్ సభ్యుడు సాయి తదితరులు పాల్గొన్నారు.