గణపతి వర్తక సంఘం నూతన కమిటీ భేటీ


అమలాపురం: శ్రీ గణపతి కూరగాయల వర్తక సంఘం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, టౌన్ సీఐ వీరబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అధికారులను సన్మానించి అభినందనలు తెలిపారు.

సంఘం గౌరవ అధ్యక్షుడిగా నల్లా పట్టాభి (బాబ్జి), అధ్యక్షుడిగా వాకపల్లి స్వామి నాయుడు (పెద్దకాపు), ఉపాధ్యక్షుడిగా నల్లా గంగరాజు, ప్రధాన కార్యదర్శిగా మట్టా చంటి కుమార్, కార్యదర్శిగా నల్లా సాయిబాబు, కోశాధికారిగా గోకరకొండ రమేష్ ఎన్నికయ్యారు.

కమిటీ సభ్యులుగా పేరాబత్తుల రామారావు, కొలిశెట్టి నాగ వెంకట వసంత్ కుమార్, కైరం శ్రీ రామ గణేష్, నార్ని శ్రీ వరాహలక్ష్మి నరసింహ రావు బాధ్యతలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.