ఘనంగా చంద్రమౌళేశ్వర, నందీశ్వర స్వాముల వార్షిక మహోత్సవం

  1. ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్టీసీ జోన్ 2 చైర్మన్, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు నియోజకవర్గం: 18వ డివిజన్ గొల్లాయిగూడెంలో కొలువుదీరిన శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి, నందీశ్వర స్వామి వారి ప్రథమ వార్షిక మహోత్సవాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్‌ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నందీశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

కృష్ణానది తీరంలో స్వామివార్ల ఉత్సవమూర్తులు, ప్రత్యేక ఆభరణాలకు కేరళ తంత్ర, జ్యోతిష్య నిపుణుడు ధనుష్ నంబూద్రి ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వివిధ పుష్పాలు, తమలపాకులతో నందీశ్వర స్వామివారికి అప్పలనాయుడు ప్రత్యేక పూజలు చేశారు.

భక్తుల కోలాహలం మధ్య మేళతాళాలతో స్వామివారి శోభాయాత్ర, గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా భక్తిశ్రద్ధలతో వార్షిక మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులను అప్పలనాయుడు అభినందించారు. నందీశ్వర స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ వైస్ ప్రెసిడెంట్ కెల్లా చిన్నా, కమిటీ సభ్యులు కె.వి.వి. సత్యనారాయణ, వి. తేజ రాజేష్ కుమార్, జనసేన ఏలూరు నగర అధ్యక్షుడు వీరంకి పండు, డివిజన్ ఇన్‌చార్జి పల్లి విజయ్, స్థానిక నాయకులు మానేపల్లి గాంధీ, మెండ విజయ్, బట్టు బద్రి, భరత్, పల్లి రాజా, ఎం. గణేష్, పి. శ్యామ్ తదితరులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.