
విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ కుమారుని వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వివాహ వేడుకల్లో ఐజేయూ నాయకులు సిన్హా, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు, రాష్ట్ర కాపు నాయకులు చందు జనార్దన్, కూన అజయ్, కె. స్వాతి ప్రసాద్, మండేల బాబీ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.