
మార్కాపురం: జిల్లాలోని కంభంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన అర్ధవీడు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు ముత్యాల శివకుమార్‌ను జనసేన జిల్లా నాయకులు కాల్వ బాల రంగయ్య పరామర్శించారు.
శివకుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కాల్వ బాల రంగయ్య, అతనికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చులకు సహాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షుడు కలగట్ల అల్లూరయ్య, సొసైటీ బ్యాంకు డైరెక్టర్ గుర్రాల రామకృష్ణ, మండల నాయకులు చట్టి శ్రీనివాసులు, తోట కేశన్న, శ్రీపతి కృష్ణయ్య, బండి రంగయ్యతో పాటు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.