దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన గంటా స్వరూప

కొవ్వూరు నియోజకవర్గం: ఐ.పంగిడి గ్రామానికి చెందిన వీరభత్తుల మణికంఠ బావ హనుమంతు దుర్గా ప్రసాద్ అకాల మరణం నేపథ్యంలో ఏపీ స్టేట్ టూరిజం డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప, డీఎన్‌ఎల్ ప్రసాద్‌తో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.