


విజయనగరం నగరంలోని 19వ డివిజన్ పరిధిలోని లంకాపట్నంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఆదివారం గురాన అయ్యలు–రాధిక దంపతులు ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లంకాపట్నం, 19వ డివిజన్ ప్రజలకు జనసేన పార్టీని మరింత చేరువ చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం వేదికగా నిలుస్తుందని తెలిపారు. స్థానిక ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, స్థానిక వార్డు నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రౌతు కుమార్, బంగారి వెంకట్, కళ్యాణం త్రినాథ్, చొక్కకుల రాజశేఖర్, జలగడుగుల మహేష్, బంగారి రమేష్, బంగారి శంకర్రావు, పొట్నూరు లోకేష్, బంగారి జగదీష్, సూరంపల్లి రాజశేఖర్, చెన్న యల్లారావు, చెన్న లక్ష్మణరావు తదితరులు హాజరయ్యారు.