
మంగళగిరి 8: విజయవాడ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ మంగళవారం జనసేన పార్టీలో చేరారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి పార్టీలో చేరాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేయగా, ఆయనను పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గుడిపాటి సీతారామ్ మాట్లాడుతూ, “నేషన్ ఫస్ట్” అనే భావజాలంతో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ నాయకత్వం తనను ఆకర్షించిందని, అదే స్ఫూర్తితో జనసేనలో చేరుతున్నానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి ప్రజాసేవలో చురుకుగా పాల్గొంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుడిపాటి సీతారామ్ సతీమణి, యువ గాయని శ్రీలలిత పాల్గొన్నారు.