
హైదరాబాద్ : మోతీనగర్‌లోని లీలా ఆసుపత్రిలో న్యూరో సంబంధిత సమస్యతో చికిత్స పొందుతున్న అల్లాపూర్‌కు చెందిన జనసేన కార్యకర్త ప్రసాద్‌ను కూకట్పల్లి జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందుతున్న చికిత్స, అవసరమైన వైద్య పరీక్షలు, మందులు, కోలుకునే ప్రక్రియపై సమగ్ర సమాచారం సేకరించారు. బాధితుడికి అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా ఆసుపత్రి సిబ్బందికి సూచనలు చేశారు.
అనంతరం ప్రసాద్ కుటుంబ సభ్యులను ఓదార్చుతూ, జనసేన పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రసాద్‌తో కాసేపు మాట్లాడి మానసిక ధైర్యం చెప్పిన ప్రేమకుమార్, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్ కూడా ప్రసాద్‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు.