ప్రమాద బాధితుడికి నిత్యావసర వస్తువులు, ఆర్థిక సాయం

ఉప్పలగుప్తం : ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన పోలిశెట్టి మాచరరావు ప్రమాదవశాత్తు భవనం పై నుంచి జారిపడి రెండు చేతులకు తీవ్ర గాయాలు కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను నాగులపల్లి వీర్రాజు ద్వారా తెలుసుకున్న సూరపురెడ్డి సురేష్ స్పందించారు.

వానపల్లిపాలెం గ్రామానికి చెందిన నల్లా మణికంఠ దంపతుల సహకారంతో నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, దంగేటి బాబులు సహకారంతో రూ.2,000 నగదు గ్రామ పెద్దల చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు.

ఈ సందర్భంగా పోలిశెట్టి మాచరరావు తనకు అండగా నిలిచిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సుంకర, పోలిశెట్టి ఉమా, దంగేటి శ్రీహరి, పోలిశెట్టి రత్నం, సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.