రాజకీయాల్లో జనసేనది నూతన ఒరవడి

* అన్ని విభాగాలకు దరఖాస్తుల వెల్లువ
* దరఖాస్తులను పరిశీలించనున్న జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్
* మీడియా సమావేశంలో సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్

రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించి, పార్టీ నిర్మాణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టిన ఘనత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిదేనని జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ పేర్కొన్నారు. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో పూర్తి కావడంతో కార్యక్రమం జరిగిన తీరును వివరించేందుకు సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్తల బృందం సభ్యులు కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శివ శంకర్ మాట్లాడుతూ … ‘‘జనసేన పార్టీలోని గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి పదవులకు సంబంధించి సమాచార సేకరణ అనే గొప్ప ప్రక్రియ ఇది. జెన్ జీ ఆలోచనలకు దగ్గరగా, పారదర్శకంగా పార్టీని బలోపేతం చేసే ఈ క్రతువులో ఆదివారం నాటికీ భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. పార్టీకి అనుబంధ విభాగాలకీ అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. యువతరం భారీగా స్పందించి పార్టీ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారు, పార్టీ ఉన్నతికి ఆలోచించే ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలనే తలంపుతో చేపట్టిన కార్యక్రమం ఇది. దీనికి అనుగుణంగానే సమాచార సేకరణ కమిటీలు పారదర్శకంగా దరఖాస్తులను తీసుకున్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం వారీగా వేసిన 28 మంది కమిటీ సభ్యులు, పరిశీలకులు వీటిని జాగ్రత్తగా పార్టీ కేంద్ర కార్యాలయానికి రేపటి నుంచి చేర్చుతారు. వీటిని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా పరిశీలించి, అందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారు. స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయలేని ఓ గొప్ప విధాన నిర్ణయాన్ని విజయవంతంగా అమలు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి బాటలో ప్రతి కార్యకర్త నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మార్పు ఆశించాలంటే.. ముందు అది మన నుంచి మొదలు కావాలనే గొప్ప సంకల్పంతో శ్రీ పవన్ కళ్యణ్ గారి ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త ముందుకు నడవనున్నారు. రేపటి నుంచి దరఖాస్తుల పరిశీలన, చర్చలు, సమావేశాలు ఉంటాయి. అన్ని విభాగాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను స్వయంగా పార్టీ అధ్యక్షుల వారే పరిశీలించి, తగిన విధంగా పదవులను నిర్ణయిస్తారు. జనసేన మరో ప్రస్థానం.. మహా ప్రస్థానంగా ఇక నుంచి దూసుకుపోనుంది.’’ అన్నారు. ఈ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు డా.పెదపూడి విజయ్ కుమార్, డా.సందీప్ పంచకర్ల, శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు, డా. దివ్యరాజ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.