విజయవంతంగా ముగిసిన జనసేన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం

కడప: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, కడప పార్లమెంట్ పరిశీలకుడు చిలకం మధుసూదన రెడ్డి నేతృత్వంలోని 28 మంది సభ్యుల బృందం ఆధ్వర్యంలో కడపలోని హరిత హోటల్‌లో నిర్వహించిన పార్టీ కమిటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ఏడు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ కమిటీల్లో బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన నాయకులు, జనసైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అందిన దరఖాస్తులన్నింటినీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిశీలనకు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా చిలకం మధుసూదన రెడ్డి మాట్లాడుతూ, కడప పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు. దాదాపు వెయ్యికి పైగా దరఖాస్తులు అందాయని, పార్టీ అభివృద్ధికి సేవ చేయాలనే తపనతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

దరఖాస్తుల పరిశీలన పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, వ్యక్తిగత అభిప్రాయాలకు ఎలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. తుది నిర్ణయం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకుంటారని, పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల అంకితభావంతో పనిచేసే వారికి సముచిత అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ జనసేన నిర్మాణ సమాచార సేకరణ కమిటీ సభ్యులు తాతంశెట్టి తులసి నాగేంద్ర, ఎరువ దివ్య, ఉదయశ్రీ, పండ్రా రంజిత్ కుమార్, సురేష్ బాబు, మురళీకృష్ణ, డాక్టర్ నాగార్జున, గోగు లక్ష్మీ భరత్, గజ్జల సాయి ప్రసన్న, ఏ. రామారావు, ఈశ్వర్ రెడ్డి, నందకిషోర్, రాము, రవిశంకర్, చలపతి, జగదీష్, సీహెచ్ నాగమల్లయ్య, సిద్ధాంత్, జి. విజయ్, రామ్ సిద్దు, కిరణ్ కుమార్, తోట బాలచంద్రుడు, మాదాసు మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.