
సోలాపూర్: సోలాపూర్ జనసేన బృందం ఆధ్వర్యంలో జూలై 5న హోమ్ మైదాన్‌లో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం, సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ప్రతి ఒక్కరిదేననే సందేశాన్ని ప్రజలకు అందించారు. సోలాపూర్ జనసేన బృందం సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, రాబోయే అన్ని కార్యక్రమాలకు కూడా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని వెల్లడించింది.
ఈ సేవా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి నాయకుడు, కార్యకర్త, మద్దతుదారుడికి సోలాపూర్ జనసేన బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ప్రజాసేవను లక్ష్యంగా పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొంది.