వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ఆనందరావు.. తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు

అమలాపురం : అమలాపురం నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతిపత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రతి వినతిని శ్రద్ధగా పరిశీలించిన ఎమ్మెల్యే ఆనందరావు, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా, ప్రతి సమస్యకు సమయానుకూలంగా పరిష్కారం లభించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, పెచ్చెట్టి విజయలక్ష్మి, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, కర్రి దత్తుడు, మట్ట ప్రభాకర్, జనసేన నాయకులు సుధా చిన్న, నల్లా చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.