
తాడేపల్లి : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) ఆధ్వర్యంలో తాడేపల్లి సీతానగరం పార్కులో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు అంబటి తిరుపతి రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్కు ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల తన నిబద్ధతను చాటిచెప్పారు. అనంతరం మాట్లాడుతూ, ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం తమ బాధ్యతగా భావించాలని సూచించారు.
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణం అందించాలంటే చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చల్లా వెంకటేశ్వర్లు (జనసేన బాబాయ్), దుర్గ బాబు, శివ, వేముల వెంకట్, మల్లెల దుర్గ బాబు, దినేష్ చక్రవర్తి, వెంకట్రావు, నంద్యాల శ్రీనివాసరావు, నానాజీ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతు ప్రకటించారు.