
ఏలూరు నగరంలోని తూర్పు వీధిలో ఉన్న శ్రీరామాలయం, శివయ్య గుడిలో శ్రీ పరంజ్యోతి అమ్మ భగవతి–భగవాన్ దివ్య కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవాన్ని తిలకించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్‌ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రెడ్డి అప్పలనాయుడు, అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మ భగవాన్ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
అనంతరం ఆయన చేతుల మీదుగా భక్తులకు పూలు, పండ్లు, మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేశారు.