
జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయడం కంటే ఆయన తన మంత్రిత్వ శాఖల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిపై చర్చించాలని అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు, లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.
ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్‌పై నిరాధార విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
అలాగే ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షల సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జూన్ 2న హైదరాబాద్‌లో నిర్వహించనున్న “తెలంగాణ నవ నిర్మాణ కోసం” జనసేన ఉద్యమకారుల మహాసభ విజయవంతం కావాలని ఆకాంక్షించిన జయరాం రెడ్డి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజలు ఆశించిన లక్ష్యాలు, అభివృద్ధి ఆశయాలు నెరవేరే దిశగా జనసేన పార్టీ పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
చివరగా జనసేన సిద్ధాంతాలు, జాతీయ సమైక్యత, ప్రజా సంక్షేమం కోసం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు.