
సర్వేపల్లి: సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం బద్వేల్ క్రాస్ రోడ్డు సమీపంలోని సంగమేశ్వర గిరిజన కాలనీలో జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించి గిరిజన కుటుంబాల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులకు స్లేట్లు, పెన్సిల్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ప్రతి గిరిజన బిడ్డకు విద్య అందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నామని చెప్పారు. గిరిజన కాలనీల్లో మౌలిక సదుపాయాల సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, విద్యే సమాజ అభివృద్ధికి ప్రధాన మార్గమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇతర గిరిజన కాలనీల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో పరస్పర గౌరవం, సామరస్యం అవసరమని, వ్యక్తిగత విమర్శలు మరియు ప్రాంతీయ విద్వేషాలకు తావు లేకుండా ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఖాదర్వల్లి, జాకీర్, పెనుబక మహేష్, పిడూరి సీనయ్య, సందూరు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.