హనుమజ్జయంతి సందర్భంగా దాసాంజనేయ స్వామి ఆలయంలో మహా అన్నసమారాధన

ఏలూరు : హనుమజ్జయంతి మహోత్సవాల సందర్భంగా ఏలూరులోని 7వ డివిజన్ బెనర్జీపేటలో ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో మహా అన్నసమారాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి శ్రీ దాసాంజనేయ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రెల్ల రామకృష్ణ ఆహ్వానం మేరకు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం దాసాంజనేయ స్వామివారికి పుష్పాలు, తమలపాకులతో ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్న అన్నదానం ఎంతో గొప్పదని అన్నారు. గత వారం రోజులుగా హనుమజ్జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ, ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్న ఆలయ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, జనసేన రవి, జగపతి మనోహరం స్వామి, బోండా రాము నాయుడు, బెజవాడ నాగభూషణం కుమార్, వాసా సాయి, కొండల ప్రసాద్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.