
ఆముదాలవలస: ఆముదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం పెద్దలంకాం గ్రామానికి చెందిన జనసైనికుడు దేసిళ్ళ కృష్ణ ఇటీవల అనారోగ్య సమస్యతో మృతి చెందారు. ఈ విషాద ఘటనతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
ఈ నేపథ్యంలో స్థానిక జనసేన నాయకుల సహకారంతో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పల్లి తవిటి నాయుడు, మజ్జి రాంబాబు, బొచ్చ సురేష్, తోట అప్పలరాజు, పల్లి సంతోష్, లావేటి రమణమూర్తి, పాడి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.