
నరసాపురం నియోజకవర్గం: అనారోగ్య కారణంగా ఆసుపత్రి ఖర్చుల కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 18 మంది లబ్ధిదారులకు రూ.8,98,792 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేయబడ్డాయి. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వ్యక్తిగతంగా చెక్కులు అందజేయడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ అవుతోందని ఆయన తెలిపారు.
అనంతరం ఆయన లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కష్టకాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా కృషి చేస్తుందని పేర్కొన్నారు.