


కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి భారీ సంఖ్యలో చేరికలు జరిగాయి. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, అన్ని కులాలు మరియు మతాలను సమానంగా గౌరవించే సిద్ధాంతాలకు ఆకర్షితులై పలువురు నాయకులు పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమం కావలి నియోజకవర్గ ఇంచార్జీ అలహరి సుధాకర్ నేతృత్వంలో, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు, మైనారిటీ నాయకులు, అలాగే వైసీపీ సీనియర్ నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఆలూరు మండలానికి చెందిన వైసీపీ జిల్లా కార్యదర్శి దేవరకొండ సోము (శేషి కుమార్)తో పాటు రేవూరు విజయ్ కుమార్, ప్రసన్న కుమార్, మోషే, జాషువా, ప్రభాకర్, నాగరాజు తదితర పాస్టర్లు పార్టీలో చేరారు. అలాగే చౌటపాలెం ప్రాంతానికి చెందిన మైనారిటీ నాయకులు ఆసిఫ్ ఎస్.కె, మీరా మధీన్ ఎస్.కె, ఇమ్మానుయేల్, శ్రీనివాసులు చెవూరి, అగాపే జాడ్సన్, నాథాను, రవి తదితరులు కూడా జనసేనలో చేరి తమ మద్దతు ప్రకటించారు.
ఈ చేరికలు జనసేన పార్టీ పట్ల వివిధ వర్గాల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా పార్టీ నాయకులు పేర్కొన్నారు.