మూలపోడులో చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ సేవలు

రాజోలు నియోజకవర్గం: గుడిమెళ్ళంక గ్రామం, మూలపోడులో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి స్పందించింది.

ప్రజల అవసరాన్ని గుర్తించి జనసేన చిరుపవన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా గ్రామానికి తాగునీరు సరఫరా చేశారు. ఈ కార్యక్రమానికి రాజోలు డిస్ట్రిబ్యూషన్ వైస్ చైర్మన్ తిరుమల సుబ్బారావు అందించిన ఆర్థిక సహకారంతో ట్రాక్టర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతం ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు.

గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు చేపట్టిన ఈ చర్యతో స్థానికులు ఉపశమనం పొందారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.