
అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికుల దాహార్తిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు.
గురువారం అమలాపురం ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని డిపో మేనేజర్ డీఎల్‌ఎన్ శర్మ ప్రారంభించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ప్రతిమాకుమారి, ఎస్‌ఎం ఏవీఎస్ నారాయణ, ఓపీఆర్‌ఎస్ ఎన్ వరహాల బాబు పాల్గొన్నారు.
అలాగే ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు నంబూరి విశ్వనాథం, అధ్యక్షుడు యర్రమిల్లి విశ్వేశ్వరరావు, కార్యదర్శి నూలు సూరిబాబు, కోశాధికారి శ్రీకాకోలపు రాంపండు తదితరులు సేవలందించారు. వేసవి కాలంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో మరికొన్ని రోజులు ఆర్టీసీ డిపోలో మజ్జిగ చలివేంద్రం కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.