జాతీయ స్థాయి పురస్కారాలు గర్వకారణం

స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న దృఢ సంకల్పంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు  గారి నేతృత్వంలోని NDA ప్రభుత్వం, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2025, నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్–2025 అవార్డుల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో స్థానం దక్కడం గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో అవార్డులు సాధించిన శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి, గ్రామ ప్రజలకు, అలాగే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.