
రాజంపేట: జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీలో రాజంపేట పార్లమెంట్ పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌కు ఉమ్మడి కడప జిల్లా కార్యక్రమాల కార్యవర్గ సభ్యుడు గురివిగారి వాసు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై పార్టీ నాయకత్వం ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు నీతి, నిజాయితీతో బాధ్యతలను నిర్వర్తిస్తానని అన్నారు. పార్టీ బలోపేతం, జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో తన శక్తి మేరకు అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తామని, ఆయన ఆశయాలు మరియు లక్ష్యాల సాధనలో ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని తెలిపారు.
అలాగే తనకు ఈ బాధ్యతలు దక్కేందుకు సహకరించిన కృష్ణ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీ పట్ల మరింత అంకితభావంతో సేవలందిస్తానని గురివిగారి వాసు స్పష్టం చేశారు.