డిప్యూటీ సీఎం పవన్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లోని నివాసానికి వెళ్లిన సీఎం, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

గత నెలలో పాలనాపరమైన సమీక్ష సమావేశం సందర్భంగా పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షలు నిర్వహించి సైనసైటిస్ సమస్యకు శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించారు. అనంతరం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో ఆయనకు సర్జరీ నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సూచించారు.

వైద్యుల సలహా మేరకు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా అనారోగ్య సమయంలో చంద్రబాబు ఆయనను పరామర్శించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.