10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు

• కూటమి ప్రభుత్వ సంస్కరణలతో అద్భుత ఫలితాలు
పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం సుమారు 4 శాతంపైగా మెరుగుపడడం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకువస్తున్న సంస్కరణలకు నిదర్శనం. విద్యాశాఖ మంత్రిగా శ్రీ నారా లోకేష్ గారు అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రశంసనీయం. మెగా పేరెంట్ టీచర్స్ మీట్ , పరీక్షలకు ముందు తీసుకువచ్చిన 100 రోజుల ప్రణాళిక వంటివి అద్భుత ఫలితాలకు దోహదపడ్డాయి. ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో గత ఏడాది 72.8 శాతం ఉత్తీర్ణత సాధించగా, అది ఈ ఏడాది 78.39 శాతానికి పెరిగింది. ఈ అద్భుత విజయం వెనుక ఉన్న ఉపాధ్యాయులకు, విద్యాశాఖ అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.