


అవనిగడ్డ నియోజకవర్గంలో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా విస్తృతంగా నిధులు మంజూరు చేస్తూ పల్లెల ప్రగతికి దోహదం చేస్తున్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామాల్లో రహదారులు, త్రాగునీటి సదుపాయాలు, పశువుల సంరక్షణ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి.
పల్లె పండుగ 1.0 కార్యక్రమం ద్వారా రూ.31.65 కోట్లతో 47 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 6.30 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించబడినాయి. అలాగే పల్లె పండుగ 2.0 ద్వారా రూ.4.34 కోట్లతో 9.8 కిలోమీటర్ల ప్రధాన రహదారులు అభివృద్ధి చెందాయి.
అదేవిధంగా సాస్కి నిధుల ద్వారా రూ.14.57 కోట్లతో 35.30 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి ఆమోదం లభించింది. జల్ జీవన్ మిషన్ కింద రూ.14.37 కోట్లతో గ్రామాల్లో త్రాగునీటి సదుపాయాల కోసం పైప్‌లైన్లు, ఓహెచ్ఎస్ఆర్ పథకాలు అమలు చేయనున్నారు.
ఇక పశువుల సంక్షేమం కోసం గోకులాల నిర్మాణం, నీటి తొట్టెల ఏర్పాట్లు చేపట్టి గ్రామీణ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారు.
పల్లెల ప్రగతి – గ్రామీణ వికాసం సాకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో గ్రామాలకు అభివృద్ధి శోభ పల్లె పండుగ 1.0ద్వారా రూ.31.65 కోట్లతో 47కిలోమీటర్లు సీసీ, 6.30 కిలోమీటర్లు బీటీ రోడ్ల నిర్మాణం పల్లె పండుగ 2.0 ద్వారా రూ.4.34 కోట్లతో 9.8 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం నియోజకవర్గంలో 35.30 కిలోమీటర్లు బీటీ రోడ్ల నిర్మాణానికి సాస్కి నిధులు రూ.14.57 కోట్లు మంజూరు జల జీవన్ మిషన్ పనులకు రూ.14,37,67,000లు మంజూరు రేపు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం అవనిగడ్డ: పల్లెసీమలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి విశేష సహకారం అందిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అందిస్తున్న సంపూర్ణ సహకారంతో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నియోజకవర్గంలో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు రహదారి సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో అంతర్గత రహదారులు సిమెంట్ కాంక్రీట్ రహదారులుగా తీర్చిదిద్దారు. ఐదేళ్లలో అభివృద్ధికి నోచుకోని గ్రామీణ ప్రధాన రహదారులు తారు రోడ్లుగా అభివృద్ధి చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా పల్లెసీమల సమగ్ర ప్రగతికి, గ్రామీణ ప్రాంతాల పునర్వికాసానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సద్వినియోగం చేసుకుని గ్రామాల ప్రగతికి బాటలు వేశారు. పల్లె పండుగ 1.0 కార్యక్రమం ద్వారా ఉపాధి నిధులు రూ.31.65 కోట్లతో అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ 462 సీసీ రోడ్లు, తారు రోడ్లు నిర్మాణం గావించారు. తద్వారా నియోజకవర్గంలో 47కిలోమీటర్ల అంతర్గత రహదారులు సీసీ రోడ్లుగా, 6.30 కిలోమీటర్ల ప్రధాన రహదారులు తారు రోడ్లుగా నిర్మాణం చేశారు. ఈ నిధులతో నియోజకవర్గంలోని కృష్ణానదీ గర్భ గ్రామాలలో నూరు శాతం సీసీ రోడ్లు నిర్మించటం ద్వారా వరదల సమయంలో ఆయా గ్రామాల ప్రజలు ఎదుర్కొనే కష్టాలు తీర్చారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా ఉపాధి నిధులు రూ.4.34 కోట్లతో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ నియోజకవర్గంలో పదకొండు ప్రధాన రహదారులను తారు రోడ్లుగా అభివృద్ధి చేశారు. తద్వారా నియోజకవర్గంలో 9.8 కిలోమీటర్లు ప్రధాన రహదారులు తారు రోడ్లుగా అభివృద్ధి చెందాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన Scheme for Special Assistance to States for Capital Investment (సాస్కీ) నిధుల నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రధాన రహదారుల అభివృద్ధికి రూ.14.57 కోట్లు మంజూరు చేశారు. తద్వారా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నియోజకవర్గంలో 35.30 కిలోమీటర్ల మేరకు తారు రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు ఆరు ప్రధాన రహదారులను ఎంపిక చేశారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో పాడి గేదెలు, మేకలు, గొర్రెల కోసం మొదటి ఏడాది రూ.2.32 కోట్లతో 214 గోకులాలు నిర్మించారు. రెండో ఏడాది రూ.1.71 కోట్లతో 103 గోకులాల నిర్మాణం చేపట్టారు. మూగ జీవాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు నియోజకవర్గంలో రూ.6.4 లక్షలతో 24 నీటి తొట్టెల నిర్మాణం చేపట్టారు. జల జీవన్ మిషన్ పనులకు రూ.14,37,67,000లు మంజూరు అవనిగడ్డ నియోజకవర్గంలో జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ పనులకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి రూ.14కోట్ల 37లక్షల 67వేలు మంజూరు చేశారు. మోపిదేవి మండలానికి రూ.5,43,94,000లు, నాగాయలంక మండలానికి రూ.2,56,000లు, చల్లపల్లి మండలానికి రూ.2,64,80,000లు, ఘంటసాల మండలానికి రూ.1,92,83,000లు, అవనిగడ్డ మండలానికి రూ.91లక్షలు, కోడూరు మండలానికి రూ.89,10,000లు మంజూరు చేశారు. ఈ నిధులతో గ్రామాల త్రాగునీటి అవసరాలకు అనుగుణంగా నూతన ఓహెచ్ఎస్ఆర్ పథకాలు, నూతన పైప్ లైన్లు, మైక్రో ఫిల్టర్లు, సంబంధిత పనులు చేపట్టనున్నారు…