
మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్‌ను జిల్లా కలెక్టర్ విజయ సునీత బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
రాయవరం ప్రాంతంలోని వెలిగొండ ప్రాజెక్టు గెస్ట్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఏర్పడిన తర్వాత ఉన్న పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా అంశాలపై కలెక్టర్ చైర్మన్‌కు వివరించారు.
అనంతరం వెలిగొండ ప్రాజెక్టు నమూనాను ఎస్ఈ అబూతలిం సమగ్రంగా వివరించారు. ప్రాజెక్టు పురోగతి, ఉపయోగాలు గురించి చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, ఎస్సీ కమిషన్ సభ్యులు గౌతమ్ రాజు, రామాంజమ్మ, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్, డీఎస్పీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.