అళహరి శ్రీనివాస్ ను కలిసిన జనసేన నేతలు

గుంటూరు: స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీగా నూతనంగా నియమితులైన అళహరి శ్రీనివాస్ ను జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని అయన ఛాంబర్ లో కలిశారు. ఈ సందర్బంగా స్పెషల్ డియస్పిగా నియమితులైన అళహరి శ్రీనివాస్ ను జనసేన నేతలు దుస్సాలువాతో సత్కరించారు.

ఈ సందర్బంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో నిఘా విభాగం కీలకపాత్ర వహించాలని కోరారు. గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత శ్రద్ద పెట్టాలన్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటూ సెల్ ఫోన్ వంటి పరికరాలతో రెచ్చిపోతున్న అసాంఘిక శక్తులపై ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపాలని కోరారు.

జిల్లా యస్పి వకుల్ జిందాల్ నేత్రత్వంలో జిల్లా పోలీస్ యంత్రాంగం బాగా పని చేస్తుందని ఆళ్ళ హరి కొనియాడారు. అళహరి శ్రీనివాస్ ను సన్మానించ్చిన వారిలో జనసేన నగర కార్యదర్శి షేక్ మెహబూబ్ బాషా, కోలా అంజి, కటికలా శివ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.