
అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల ముఖ్య సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పార్లమెంటులో ప్రవేశపెడుతున్న నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మహిళా సాధికారతకు ఈ చట్టం కీలకమని, రాజకీయ ప్రాతినిధ్యంలో మహిళలకు మరింత అవకాశం కల్పించే దిశగా ఇది ముఖ్యమైన అడుగు అని నేతలు అభిప్రాయపడ్డారు.
భవిష్యత్ అమలు, రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో దిశానిర్దేశం జరిగినట్లు సమాచారం