
పెదకూరపాడు నియోజకవర్గం: ధరణికోటలో కార్మికులతో కలిసి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పేదలకు స్వయంగా భోజనం వడ్డించి, లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు.
అన్న క్యాంటీన్‌లో భోజనం అనంతరం ముఖ్యమంత్రి లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పేదలకు నాణ్యమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవాల్టి నుంచే గ్రామీణ ప్రాంతాల్లో 62 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 204, గ్రామీణ ప్రాంతాల్లో 65 కలిపి మొత్తం 269 అన్న క్యాంటీన్లు ప్రజలకు సేవలందిస్తున్నాయి.